మార్చి 29, 30 తేదీల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు

UPDATED 23rd MARCH 2018 FRIDAY 6:30 PM

పెద్దాపురం: పెద్దాపురం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీలలో పెద్దాపురం, రంగంపేట మండలాల గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించనున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా 29వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రిన్సిపల్ జూనియర్  సివిల్ జడ్జి ఆధ్వర్యంలో రంగంపేట మండలం వెంకటాపురం గ్రామంలో, 30వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో, ఉదయం 10 గంటలకు రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో, 11 గంటలకు పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో, 12 గంటలకు వాలు తిమ్మాపురం గ్రామంలో ప్యానెల్ లాయర్లు, ఎం.ఎల్.ఎస్.సి. ఆధ్వర్యంలో ఈ సదస్సులు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రజలు ఈ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us