UPDATED 7th JUNE 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: భవన నిర్మాణ కార్మికులకు చెందిన పెండింగ్ లో ఉన్న క్లైములు తక్షణం చెల్లించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సామర్లకోట పట్టణ కమిటీ సమావేశం పెనుపోతుల సత్తిబాబు అధ్యక్షతన భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకంలో జిల్లా వ్యాప్తంగా క్లైములు రూ.2.30 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ భీమా క్లైములు పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరుగుతుందని, క్లైములు తొందరగా పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ప్రకృతి ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి బర్ల గోపాల్, ఉపాధ్యక్షులు నక్కా రాజారావు, అడబాల కనకారావు, సహాయ కార్యదర్శి బత్తుల సత్యన్నారాయణ (బుజ్జి), బర్రె సత్తిబాబు, సిఐటియు నాయకులు తుంపాల శ్రీనివాస్, బాలం సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.







