పాఠశాలల అభివృద్ధికి దాతలు సేవలు అభినందనీయం

UPDATED 5th JULY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సేవలు ఎంతో అభినందనీయమని మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొప్పవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఎలైట్ ఆయిల్ సంస్థ (చెందుర్తి)కు చెందిన ప్రతినిధులు తోట సుబ్రహ్మణ్యం, కె. మల్లయ్య రూ.20 వేలు విలువైన ఫర్నీచర్ పాఠశాలకు అందజేశారు. అలాగే అచ్చంపేట మాజీ ఎంపిటిసి వీరంరెడ్డి చినబాబు విద్యుత్ సదుపాయము నిమిత్తం రూ. 8వేలు, రూ. మూడు వేలు విలువైన రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు సలాది రమేష్ పాఠశాలకు సహాయం అందించారు. అనంతరం ఎంఈవో శివరామకృష్ణయ్య మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. సత్యవతి, ఉపాధ్యాయురాలు జె. బృందావని, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us