UPDATED 21st DECEMBER 2017 THURSDAY 6:30 PM
సామర్లకోట: భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 131వ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన తోటకూర వెంకట శివ సూర్య సాయి వంశీ ఎటుకూడినా 131 వచ్చేలా గణిత చదరం రూపొందించి రామానుజన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ చదరంలో నిలువు వరసలు మొత్తం, అడ్డు వరసలు మొత్తం, కర్ణాలు మొత్తం, అలాగే ఏ నాలుగు సంఖ్యలు మొత్తం కూడిన 131 వచ్చే విధంగా రూపొందించాడు. కాకినాడ ఆదిత్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న వంశీ తన పెదనాన్న ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ వద్ద గణితంలో మెళకువలు నేర్చుకుని, ఏడవ తరగతి నుంచి జాతీయ పండుగలు, జాతీయ నాయకుల జన్మదినోత్సవాలకు గణిత చదరాలను రూపొందించడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ సందర్భగా ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ నల్లమిల్లి కృష్ణదీపక్ రెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపాల్ రమణి, తదితరులు వంశీని అభినందించారు.







