* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
UPDATED 3rd JUNE 2018 SUNDAY 10:30 PM
కాకినాడ: సంజీవి ఆసుపత్రిలో హర్ట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో చేసేందుకు అవకాశం కలిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హెూంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక టూటౌన్ నూకాలమ్మ ఆలయం వెనుకగల సంజీవి ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవి హార్ట్ ఇనిస్టిట్యూట్ ను ఆదివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవలతో ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఎపిఇపిడిసిఎల్ వంటి అనేక ఇన్సూరెన్స్ సేవలు ఈ ఆసుపత్రి ద్వారా అందుతున్నాయని, ఈ కార్డియాలజి విబాగం ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నెక్కంటి సూర్యప్రసాద్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో కేవలం రూ. 599 కే హార్ట్ చెకప్ కు సంబంధించిన ఇ.సి.1కి, టియండి, టూడి ఏకో, కార్డియాలజీ కన్సల్టేషన్ సేవలు అందించనున్నట్లు తెలియచేశారు. కార్డియాలజీకి సంబంధించిన పూర్తి సదుపాయాలు తమ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలోనే పేరెన్నికగన్న డాక్టర్ కార్డియాలజీ సేవలకు గాను పురస్కారాలు అందుకున్న డాక్టర్ బిగేష్.యు.నాయర్ తమ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాక్ థాటేరిషన్ ల్యాబరేటరీకి డైరెక్టరుగా, చీఫ్ కన్సల్టెంట్, ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్టుగా బాధ్యతలను స్వీకరించడంతో జిల్లాలోనే గుండెకు సంబంధించి ఉత్తమ వైద్య సేవలను అందించడానికి వీలుగా సేవలు విస్తరించగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తోట నరసింహం, కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, నగర మేయర్ సుంకర పావని తిరుమలకుమార్, సంజీవి ఆసుపత్రి మరిన్ని మెరుగైన సేవలు ద్వారా సమాజానికి సేవలు అందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిఎంఇ డాక్టర్ ఎంబీఆర్. శర్మ, డాక్టర్ వెంకట బుద్దా, డాక్టర్ నగేష్, డాక్టర్ అంగర రవి, డాక్టర్ నెక్కంటి సూర్యప్రసాద్, వెంకటలక్ష్మి దంపతులతో పాటు, డాక్టర్ నెక్కంటి జయదీప్, డాక్టర్ స్వప్నిక, కె. వినయకుమార్, డాక్టర్ కిన్నెరవీణ, అడ్మినిస్ట్రేటర్ వడ్డాది ఆదిత్య, పలువురు వైద్యులు, పలువురు ప్రముఖులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.







