UPDATED 1st AUGUST 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు ముఖ్య కూడలి ప్రాంతాల్లో సోలార్ బ్లింకర్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్ తెలిపారు. స్థానిక ఆర్ కె. సిరామిక్స్, అపర్ణ సిరామిక్స్ యాజమాన్యం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సోలార్ బ్లింకర్స్ ను పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు బుధవారం ప్రారంభించారు. ఇటీవల కాలంలో ముఖ్య కూడలి ప్రదేశాల్లో ప్రమాదాలు పెరిగిపోవడంతో వాటిని నివారించడానికి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరామిక్స్ సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







