UPDATED 8th MARCH 2018 THURSDAY 9:30 PM
సామర్లకోట: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీనియర్ మహిళా డాక్టర్ శ్రీ సాయిలక్ష్మిని ఘనంగా సన్మానించారు. అలాగే ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు, వారి అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు కంచర్ల మణి, కార్యదర్శి కంచర్ల కుమారి, కోశాధికారి కంచర్ల లలిత, ఉపాధ్యక్షురాలు సుష్మామోహిని, జిల్లా కమిటీ సభ్యురాలు కటకం హైమావతి, క్లబ్ సభ్యులు రాణి, శ్రీలేఖ, తదితరులు పాల్గొన్నారు.







