పాలిటెక్నిక్ విద్య తల్లితండ్రుల పాత్రపై ఆదిత్యలో అవగాహన సదస్సు

UPDATED 11th JUNE 2018 MONDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల 2018-19 విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ తరగతులు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లితండ్రులతో నిర్వహించనున్న సమావేశంలో విద్యార్ధి ఉజ్వల భవిష్యత్తుకు అధ్యాపకులు, తల్లితండ్రుల పాత్ర, ఆదిత్య అవలంబిస్తున్న విధానాలపై అవగాహనా సదస్సు జరుగుతుందని అన్నారు. ఇంతవరకు విద్యార్థి అభ్యసించిన విద్యకు, ఇకనుంచి నేర్చుకొనే విద్యకు ఎంతో వ్యత్యాసం ఉందని, ఈ సమావేశానికి తల్లిదండ్రులు విద్యార్ధితో సహా తప్పకుండా హాజరుకావాలన్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే తల్లితండ్రులు ఆదిత్య కళాశాల బస్సులలో క్యాంపస్ కు చేరుకోవచ్చని, మధ్యాహ్న భోజనవసతి కాలేజీలో ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us