సేవలతోనే తగిన గుర్తింపు

UPDATED 17th JULY 2019 WEDNEDAY 9:00 PM

సామర్లకోట: ఏ రంగంలోనైనా ఉద్యోగి చేసిన సేవలు తగిన గుర్తింపును ఇస్తాయని సామర్లకోట అర్బన్ ఐసిడిఎస్ సిడిపీవో టి.డి.ఆర్. పద్మావతి అన్నారు. సామర్లకోట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సూపర్ వైజర్లుకు వీడ్కోలు కార్యక్రమం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిడిపీవో పద్మావతి మాట్లాడుతూ చిన్నారులు, మహిళలకు సేవ చేసే అదృష్టం కేవలం ఐసిడిఎస్ ద్వారా మాత్రమే కలుగుతుందని, ఉత్తమ సేవలు అందించే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సామర్లకోట పట్టణంలో 70, పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో 30 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అవి సక్రమంగా పని చేయడానికి వీరు ఎంతో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే బదిలీపై వెళ్లిన ప్రదేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. బాలత్రిపుర సుందరి పెద్దాపురం, నళిని తాళ్లరేవు, మంగ రాజవొమ్మంగి బదిలీ అయ్యారని తెలిపారు. నూతన సూపర్ వైజర్లుగా ముమ్మిడివరం నుంచి ఎం. ఉమాదేవి, తుని అర్బన్ నుంచి ఎండి సత్తార్ బీబీ, తాళ్లరేవు నుంచి వచ్చిన నిర్మలకు అంగన్వాడీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం బదిలీ అయిన ముగ్గురు సూపర్ వైజర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రత్యేక అధికారి సుభద్ర, సూపర్వైజర్లు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us