India vs Pakistan: మ్యాచ్ ఇండియా గెలిచినా.. మనసులు గెలిచింది అతడే!: క్రికెట్ ఫ్యాన్స్

UPDATED 29th AUGUST 2022 MONDAY 08:00 PM

India vs Pakisthan: దుబాయ్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి అందరకి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. మొదట పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచులో పాక్‌ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు యువ పేసర్‌ నసీమ్ షా మాత్రం అభిమానుల మనసుసు గెలుచుకున్నాడు.

గాయాన్ని సైతం లెక్క చేయకుండా.. దేశం కోసం అతడు పోరాడిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. కెరీర్ లో తొలి టీ20 మ్యాచ్.. అందులోనూ తొలి ఓవర్ వేయాలంటూ కెప్టెన్ నుంచి ఆదేశాలు.. క్రీజులో నిలకడకు మారుపేరైన ఆటగాడు.. ఇవన్నీ అతనిలో కాసింత భయాన్ని కూడా కలిగించలేకపోయాయి. ఇన్నింగ్స్ ప్రారంభించిన రెండో బంతికే.. కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్. అంతటితో ఆగాడా! లేదు.. సెకెండ్‌ స్పెల్‌కు తిరిగి బౌలింగ్‌కు వచ్చిన నసీమ్‌ షా.. ‘మిస్టర్ ఇండియా 360’ సూర్యకుమార్‌ యాదవ్‌ను క్లీన్‌ బౌల్డ్‌. మైదానంలో ఒక్కసారిగా సైలెన్స్. 19 ఏళ్ల కుర్రాడా ఈ బౌలింగ్ చేస్తోంది అని. ఈ క్రమంలో అతని పాదానికి గాయమైంది. కనీసం తన పాదాన్ని నేలపై కూడా ఉంచలేని స్థితికి చేరుకున్నాడు.

అయినప్పటికీ.. నొప్పిని భరిస్తూనే తన ఓవర్‌ను పూర్తి చేశాడు. గాయం కారణంగా తన రిథమ్‌ను కోల్పోయిన నసీమ్‌ షా 18 ఓవర్ లో 11 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన నసీమ్‌ షా.. 2 వికెట్లు తీసి 27 పరుగులు ఇచ్చాడు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us