ప్రగతిలో జాతీయస్థాయి సాంకేతిక సదస్సులు

UPDATED 26th SEPTEMBER 2019 THURSDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రైడ్స్- 2019లో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎలెవర్-2019, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎక్సల్ట్-2019 సదస్సులు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు జెఎన్టీయుకె (కాకినాడ) మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. కైలాసరావు, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ (కాకినాడ) ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలుత స్ట్రైడ్స్-2019 సావనీర్ ఆవిష్కరణతో ఈ సదస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ భావి ఇంజనీర్లకు అవసరమైన అన్ని అవకాశాలను తమ కళాశాల అందిస్తుందని, విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నూతన ఆవిష్కరణలకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.వి. శివరామకృష్ణ మాట్లాడుతూ ఎలెవెర్-2019లో 40 పేపర్ ప్రెజంటేషన్లు, 25 పవర్‌ పాయింట్ ప్రెజంటేషన్లు, 21 పోస్టర్ ప్రెజంటేషన్లు, 32 మోడల్ ఎక్స్పోలు, 24 టెక్నికల్ క్విజ్ జట్లు పాల్గొన్నాయని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె. సత్యనారాయణ మాట్లాడుతూ ఎక్సల్ట్-2019 సదస్సులో మొత్తం 261 మంది వివిధ ఈవెంట్లలో పాల్గొన్నారని, వారిలో 25 పేపర్ ప్రెజంటేషన్లు, 63 పోస్టర్ ప్రెజంటేషన్లు, 33 మోడల్ ఎక్స్పోలు, 41 టెక్నికల్ క్విజ్ జట్లు   ఫైనల్ సెలక్షన్లో ఉన్నాయని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి జెఎన్టీయుకె (కాకినాడ) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. మైనర్ బాబు, షమీమ్ భాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి జెఎన్టీయుకె (కాకినాడ) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. రవీంద్ర, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సూరంపాలెం) డిప్యూటీ మేనేజర్  కృష్ణ మహేష్ కుమార్ న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, ఇసిఇ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. నగేష్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us