ఆదిత్య ప్రాంగణంలో సౌరవిద్యుత్ వెలుగులు

UPDATED 29th MAY 2018 TUESDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంటును రాష్ట్ర ఇంధన, మౌళిక సదుపాయాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ జైన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉపయోగాలున్న సోలార్ పవర్ ప్లాంటును ఆదిత్యలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఎలక్ట్రికల్, డీజిల్ ఖర్చుతో కూడిన జనరేటర్ పవర్ కు బదులు దీర్ఘకాలం ఎటువంటి ఖర్చులు లేకుండా పొల్యూషన్ లేని సౌరవిద్యుత్తును క్యాంపస్ లో ప్రారంభించిన ఆదిత్య యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం గల (గ్రూప్ టాప్) సోలార్ ప్లాంటును ఇక్కడ ఏర్పాటు చేశామని, వినియోగం కాగా మిగులు విద్యుత్తును ప్రభుత్వ సంస్థలకు అందించే విధంగా ఈ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 25 సంవత్సరాల వరకు ఎటువంటి నిర్వహణ ఖర్చులు లేకుండా నాణ్యమైన కాలుష్యరహిత విద్యుత్తును పొందవచ్చని తెలిపారు. వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఒక మెగా వాట్ విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ఉన్న ఏకైక విద్యాసంస్థ ఆదిత్య అని, 180 ఎకరాల పర్యావరణహిత పచ్చని ఆహ్లాదకర ప్రాంగణం అని, సౌరవిద్యుత్తు వాడకంతో పూర్తిస్థాయి కాలుష్యరహిత ప్రాంగణంగా మారిందని అన్నారు. అనంతరం ప్రాంగణంలో గల సరస్వతీదేవి, సాయిబాబా ఆలయాలను అజయ్ జైన్ సందర్శించారు. అనంతరం అజయ్ జైన్ ను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ ఎస్.పి కల్నల్ సత్య, ఎం& పి డిఈ రాజేశ్వరీదేవి, సూపరింటెండెంట్ ఇంజనీర్ సి.హెచ్. సత్యనారాయణ రాజమండ్రి , డిఈ ఉదయభాస్కర్ కాకినాడ, ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us