UPDATED 21st MAY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని మెప్మా టి.ఎం.సి. సుధాకర్ పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో స్థానిక మెప్మా కార్యాలయం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.







