శారీరక, మానసిక వికాసానికి క్రీడలు దోహదం

* కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సీవోవో ఎం. మురళీధర్  
* శ్రీ ప్రకాష్ లో ఘనంగా ప్రారంభమైన క్లస్టర్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

UPDATED 10th OCTOBER 2019 THURSDAY 6:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : శారీరక, మానసిక, వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సీవోవో ఎం. మురళీధర్ పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో సి.బి.యస్.ఇ క్లస్టర్-VII స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సీవోవో ఎం. మురళీధర్, విశిష్ట అతిథులుగా తూర్పు గోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు రావు చిన్నారావు, శ్రీలలితా ఎంటర్ ప్రైజస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్స్ మట్టే సత్య ప్రసాద్, మట్టే శ్రీనివాస్, పట్టాభి ఆగ్రో పుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి.వి. కృష్ణారావులు హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ సి.హెచ్. విజయప్రకాష్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీధర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచి విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతీ ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. స్నేహితులతో కలిసి ఇలాంటి కార్యక్రమంలో పాల్గోవడం ఎంతో అనుభూతిని ఇస్తుందని అన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విశిష్ట అతిథులుగా హాజరైన బి.వి.కృష్ణారావు, మట్టే శ్రీనివాస్, మట్టే సత్య ప్రసాద్ మాట్లాడుతూ విద్య వ్యాపారంగా మారిన ప్రస్తుత కాలంలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు చేస్తున్న కృషి ఎంతో అభియనందనీయమని కొనియాడారు. శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో ఉన్న టేబుల్ టెన్నిస్ అకాడమీ పెద్దాపురం పట్టణానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు శ్రీలలితా ఎంటర్ ప్రైజస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు మట్టే సత్య ప్రసాద్, మట్టే శ్రీనివాస్ రూ.25 వేలు నజరానాగా ఇస్తామని ప్రకటించారు. శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఈ కార్యక్రమ ప్రారంభానికి విచ్చేసిన అతిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్ధులను అభినందించారు. ఈ పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 250 మంది బాల, బాలికలు అండర్-14, అండర్-17, అండర్ -19 వంటి ఆరు విభాగాలలో పాల్గొంటున్నారని, ఈ పోటీలు అక్టోబర్ 10 నుంచి 12వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు చీఫ్ కోచ్ గా పి.వి.యన్. సూర్యారావు, అసిస్టెంట్ చీఫ్ కోచ్ గా పి. వేణుగోపాల్ తో పాటు 14 మంది ఎంపైర్లు, పోటీలు పర్యవేక్షణాధికారిగా అధికారి మగేష్ కుమార్( వెల్లూరు, తమిళనాడు) వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్ ఎమ్.వి.వి.యస్. మూర్తి, పాఠశాల సివోవో, లెఫ్టినెంట్ కమాండర్ కె.ఎస్. రావు, వివిధ టేబుల్ టెన్నిస్ అకాడమీల కోచ్ లు, అకాడమిక్ అండ్ కల్చరల్ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us