పచ్చని మొక్కలు నాటి సంరక్షించాలి

UPDATED 7th JANUARY 2019 MONDAY 9:00 PM

రాజానగరం: స్థానిక గోదావరి డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో గ్రీన్ అండ్ కార్బన్ ఫైనాన్స్ అనే అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్  కె. వల్లీమాధవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. టేకి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నేడు పరిశ్రమల అభివృద్ధితో పాటు మానవ వినాశనానికి హానికరం కల్గించే కార్బన్ అధికంగా తయారవుతోందని, పరిశ్రమల అభివృద్ధికి ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల అభివృద్ధి కంటే ఎక్కువ పరిశ్రమల్లో కార్బన్ తయారై వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రజల జీవనానికి హాని కలుగుతోందని అన్నారు. దీన్ని నివారించేందుకు పచ్చని మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎంబీఏ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు, ప్రొఫెసర్ చంద్రయ్య, అధ్యాపకులు టి. వెంకట తాతారావు, ఎస్. రత్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us