అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

UPDATED 25th MARCH 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సత్యనారాయణపురం రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణల, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆదివారం  నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లని స్థానిక వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్మన్ సిద్దిరెడ్డి సూర్యనారాయణ, శ్రీ కుమార భీమేశ్వరస్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు పడాల వీరబాబు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి సీపీని సురేష్, ఆలయ కమిటీ సభ్యులు గండి రఘు, పడాల చిట్టిబాబు, నాగం అశోక్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us