విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలి

UPDATED 18th JULY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సామర్లకోట మండలం మాధవపట్నంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అలెయన్స్ క్లబ్ కాకినాడ, శరవణ్ సభ్యులు ఆధ్వర్యంలో గురువారం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చిట్టూరి వీర వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్‌కు మంచి ప్రణాళికలు వేసుకొని చదువు పట్ల శ్రద్ద చూపాలని, విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని అన్నారు. ఈ సందర్భంగా క్లబ్ జిల్లా గవర్నర్  కొయ్యన కుమారి ఆర్థిక సహాయంతో సుమారు 300 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు దిలీప్ కుమార్, క్లబ్ జోన్ చైర్మన్ సత్య ప్రసాద్ శ్రీనివాస్, క్లబ్ రీజినల్ ఛైర్మన్ కొవ్వూరి మునిరెడ్డి, ట్రెజరర్ చీపూరి వాసు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us