దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేయాలి

టీడీపీ సీనియర్ నేత గుణ్ణం చంద్రమౌళి

Updated 10th May 2023 Wednesday 6:10 pm

Gunnam Chandramouli : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పెద్దాపురం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని టీడీపీ సీనియర్ నేత గుణ్ణం చంద్రమౌళి (Gunnam Chandramouli) డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక  విలేఖర్లతో మాట్లాడుతూ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. నియోజకవర్గంలోని సామర్లకోటలో తడిసిన ధాన్యంతో రైతులు రోడ్డున పడ్డారని, ధాన్యాన్ని రైతుభరోసా కేంద్రాలకు తీసుకెళ్తే అధికారులు కొనుగోలు చేయడంలేదన్నారు. తేమశాతం 17 వచ్చేవరకూ ఉంచి అప్పుడు ఆర్బీకేలకు తేవాలని రైతులను వెనక్కి పంపిస్తున్నారని దీంతో రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడి, రూ.200 మేర నష్టం వాటిల్లుతున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బస్తాకు రూ.1050 ఇస్తామని చెబుతున్న మిల్లర్లు తీరా మిల్లుకు తీసుకువెళితే తేమ, రంగు పలు రకాల కారణాలను చూపిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

రైతులను నుంచి ప్రతీ ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేవరకూ తాను ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. బొండాలు ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారని, కానీ ఇంతవరకూ ఎక్కడా కొన్న దాఖలాలు లేవన్నారు. బొండాల ధాన్యం కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉద్యమిస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us