UPDATED 18th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్నాడని పెరుమాళ్ళ ప్రణయ్ అనే యువకుడు మృతికి స్థానిక బ్రౌన్ పేట అంబేద్కర్ పార్కులో దళిత సంఘాల ఐక్యత సంఘ నాయకులు మంగళవారం కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు కొల్లి చైతన్యకుమార్, జివి రాఘవులు, వల్లూరి నాని, పోలిపల్లి బాబీవర్ధన్, ముమ్మిడివరపు వీరేష్, చొల్లంగి బావి, తదితరులు పాల్గొన్నారు.







