UPDATED 5th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: విద్యార్థులకు క్రమశిక్షణ, అంకితభావం, కృషి, పట్టుదల అవసరమని కాకినాడ రూరల్ సర్కిల్ ఇనస్పెక్టర్ ఎస్. రాంబాబు అన్నారు. మండల పరిధిలోని నవర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్టూడెంట్, పోలీస్ క్యాడెట్ శిక్షణలో భాగంగా ఆంధ్రా, నన్నయ యూనివర్సిటీ బోర్డు మెంబర్ డాక్టర్ మానిక్ రెడ్డి సత్యనారాయణ, ఎం. పూర్ణ శివప్రసాద్, ఎం. విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత, శుభ్రత క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు, అవినీతికి వ్యతిరేకంగా ఉండటం మొదలగు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం ఎస్సై కె. రాంబాబు, ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ సత్యవతి, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ఇంచార్జ్, ఎన్.సి.సి అధికారి జివివి సత్యనారాయణ, పాఠశాల అసిస్టెంట్ ఎం. శ్రీనివాసరావు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిఐ రాంబాబు ఉపాధ్యాయులకు షీల్డు బహూకరించారు.







