UPDATED12th SEPTEMBER 2018 WEDNESDAY 9:00 PM
రాజానగరం: యువత క్రీడా స్పూర్తితో ఆటల్లో పాల్గొనాలని, కష్టపడే తత్వం అలవరచుకోవాలని గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్గత ఆటలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శర్మ మాట్లాడుతూ ఆధునిక కాలంలో జీవన విధానం మారి పని ఒత్తిడి పెరిగిందని, అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ నిత్యం కొంత సమయాన్ని క్రీడకు కేటాయించాలన్నారు. కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 25వ తేదీ వరకు విద్యార్థినీ, విద్యార్థులకు అంతర్గత ఆటలు నిర్వహిస్తామని అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీ గౌరీరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, విద్యార్థినులకు త్రోబాల్, ఖో-ఖో, పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులు గెలుపు,ఓటములను సమానంగా స్వీకరించాలని, నేటి ఓటమి రేపటి గెలుపు సాధనకు పునాదిగా భావించాలని అన్నారు. తొలుత ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యాయామ అధ్యాపకులు డాక్టర్ సి.ఎం.హెన్రీ, డి. సూర్యనారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి. సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







