యువజనోత్సవంలో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ

UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ కు చెందిన ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జిల్లా యువజన సంక్షేమ శాఖ పెద్దాపురం పట్టణంలో  నిర్వహించిన డివిజన్ స్థాయి యువజనోత్సవం- 2018 పోటీలలో వివిధ విభాగాలలో విశేష ప్రతిభ కనబరచి అవార్డులు గెలుచుకొన్నారని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన టి.ఎస్. మైత్రేయి మోడరన్, కర్ణాటక సంగీత పాటల పోటీలలో ప్రధమ స్థానం, ఫార్మా-డి ద్వితీయ సంవత్సరం చదువుచున్న బంజిన్, అనన్య, సుజాతలు ఫోక్ డాన్స్ విభాగంలో ప్రథమస్థానం, అలాగే ఏకపాత్రాభినయం విభాగంలో ఎన్. లలిత సంజన, లలిత సాయిచందన, ఎన్. అమృత, జి. నవ్యశ్రీ, కె. జ్యోతి, బంజిన్, సుజాతలు ప్రథమస్థానం కైవసం చేసుకొన్నారన్నారు. మోడరన్ డాన్స్ సోలో ఫ్రాంకీ పొ హెర్మెన్ ప్రధమస్థానం, కూచిపూడి డాన్స్ లో చంద్రలేఖ ద్వితీయస్థానం, కర్ణాటక సంగీతంలో అంజన తృతీయ స్థానాలలో నిలిచి బహుమతులు గెలుచుకొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్  ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, తదితరులు విజేతలను అభినందించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us