త్వరలో వైద్యశాఖలోఉద్యోగాల భర్తీ

UPDATED 2nd JULY 2017 SUNDAY 7:00 PM

శంఖవరం: జిల్లావ్యాప్తంగా త్వరలోనే వైద్యశాఖలోని ఖాళీను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.చంద్రయ్య తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసేందుకు గైనకాలజిస్ట్‌లు 3, అనస్థీషియన్లు 2, పిడియాట్రీషియన్‌ 1, ఎంబీబీఎస్‌ పోస్టులు 4, అలాగే  జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పనిచేసేందుకు గైనకాలజీలో స్పెషలిస్ట్‌లు 4, పిడియాట్రీషియన్లు 8, స్టాఫ్‌ నర్సులు 13, ఫార్మసిస్ట్‌లు 3, టెక్నీషియన్లు 11, డెంటల్‌ హైజనిస్ట్‌లు 21, ఎపిడమాలజిస్ట్‌ 1, సైకాలజిస్ట్‌ 1, ఆప్తమాలిక్‌ సర్జన్‌ 1, ఫైనాన్స్‌ అండ్‌ లాజిస్టికల్‌ కన్సల్టెంట్‌ 1, ల్యాబ్‌ టెక్నీషియన్‌ 4, ఐ సర్జన్‌ 1, మెడికల్‌ కౌన్సెలర్‌ 1, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(టీబీ) 1, ఎస్‌టీఎస్‌(టీబీ)10, మెడికల్‌ కౌన్సెలర్‌(టీబీ) 1, అకౌంటెంట్‌ 1, టీబీ, హెచ్‌వీ కౌన్సెలింగ్‌ సీనియర్‌ సూపర్‌వైజర్‌ 1, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ 1, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌(టీబీ) 1, మరో మూడు ఉద్యోగాలకు ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చంద్రయ్య తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి దరఖాస్తులు అందించాలన్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో పారా మెడికల్‌ సిబ్బంది 51 మందిని నియమించగా, వారు ప్రసుత్తం విధుల్లో ఉన్నారన్నారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను ఈ నెల 6, 7 తేదీల్లో పరిశీలిస్తామన్నారు. 8న ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించి, 9న తుది జాబితా తయారు చేసి, పరిశీలించి 10 వ తేదీన నియామక పత్రాలు అందించడం జరుగుతుందన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us