అదృశ్యమైన విద్యార్థులు లభ్యం

UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణంలోని ఒక పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థులు సోమవారం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే ఈ విద్యార్థులు అదృశ్యంపై వారి తల్లిదండ్రులు స్థానిక  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్థులు కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి వారిని ఆదివారం అర్దరాత్రి సామర్లకోట తీసుకుని వచ్చారు. ఎస్సై శ్రీనివాస్ నాయక్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును ఛేదించిన ఎస్సై, సిబ్బందిని సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us