స్వచ్ఛ పట్టణంగా పెద్దాపురాన్ని తీర్చిదిద్దుతాం

UPDATED 17th SEPTEMBER 2017 SUNDAY 11:00 AM

పెద్దాపురం: ప్రజల సహకారంతో పెద్దాపురం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు పేర్కొన్నారు. స్థానిక బ్యాంక్ కాలనీలో స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. కాలనీ ప్రాంతంలో ఉన్న పార్క్ పరిసరాలను మున్సిపల్ సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ స్పూర్తితో ప్రతీ ఒక్కరు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బిఆర్ శేషాద్రి, మున్సిపల్ ఎఈ సుధాకర్, శానిటరీ ఇనస్పెక్టర్  డి.డేవిడ్ రాజు, కౌన్సిలర్స్ బేదంపూడి సత్తిబాబు, కందుల కుమార్, బ్యాంక్ కాలనీ  అసోసియేషన్ సభ్యులు యం.డి.జాని, కె.శివరాం, డి.భాస్కరరావు, మునిసిపల్ శానిటరీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us