సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టీమ్ కు ఎంపికైన ఆదిత్య విద్యార్థులు

UPDATED 5th NOVEMBER 2018 MONDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు చెందిన కబడ్డీ టీమ్ ఈ నెల 1, 2 తేదీలలో రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరిగిన యూనివర్సిటీ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజి తెలిపారు. తమ కళాశాలకు చెందిన జి. సీతారామలక్ష్మి, ఎస్.ఎస్.ఎస్.ఎల్. ప్రసన్న ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు బెంగళూర్ నార్త్ యూనివర్సిటీలో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ సందర్బంగా టీమ్ సభ్యులను, సౌత్ జోన్ కు ఎంపికైన విద్యార్థులను ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ద్వితీయ స్థానం సాధించిన కబడ్డీ జట్టును ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ జట్టు సభ్యులు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్. రవి,  తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us