UPDATED 9th JANUARY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని జన్మభూమిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గ్రామ సర్పంచ్ దడాల నాగరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఐదవ విడత జన్మభూమి-మా ఊరు సదస్సులో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఐదవ విడత జన్మభూమిలో పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఈ సదస్సులో 292 మంది విద్యార్థులకు రూ.3.54 లక్షల ఉపకార వేతనాలు, ముగ్గురికి చంద్రన్న భీమా పరిహారం రూ. తొమ్మిది లక్షలు చెక్కులు మంత్రి అందచేశారు. పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు జన్మభూమి ప్రతిజ్ఞ చేసి రేషన్ కార్డుల పంపిణి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు( శ్రీనుబాబు), జెడ్పిటిసి గుమ్మళ్ల విజయలక్ష్మి, ఎంపిపి గొడతా మార్త, వైస్ ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, మండల కో ఆప్షన్ సభ్యుడు మామిడాల రామకృష్ణ, వెంకటకృష్ణ రాయపురం సర్పంచ్ కుర్రా నారాయణస్వామి, డిప్యూటీ తహసీల్దార్ ఎస్.జె.ఎస్. ప్రసాద్, ఎంపిడివో నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







