UPDATED 16th NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నగరదర్శిని-నగరవికాసం కార్యక్రమం శుక్రవారం స్థానిక 23వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరావు పాల్గొని వార్డులో గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







