ఘనంగా సరస్వతీ, సాయిబాబా ఆలయాల ద్వితీయ వార్షికోత్సవం

UPDATED 9th MARCH 2020 MONDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల  సరస్వతి, షిరిడీ సాయిబాబా ఆలయాల ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల  చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీ రాజ్యం దంపతులు ఆధ్వర్యంలో విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, హారతులు తదితర పూజలతో ఆదిత్య ప్రాంగణం  ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అలాగే సప్తనదీ జలాలతో అష్టోత్తర కలశాభిషేకం, పుష్పార్చనలు, త్రిరాత్ర దీక్షలు, దేవీ పంచాయతన హోమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం షిరిడీ సాయిబాబా, సరస్వతీ దేవి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి, కృష్ణ దీపక్ రెడ్డి, సుగుణారెడ్డి, ఆదిత్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us