ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలి

UPDATED 11th FEBRUARY 2019 MONDAY 8:00 PM

పెద్దాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్థానిక మహారాణీ కళాశాలను ఆయన తహసీల్దార్ కె. గోపాలకృష్ణతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచే గదులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే తరగతి గదులు, గ్రౌండ్స్, బస్సులకు మార్గం, త్రాగునీరు, వసతి, జనరేటర్, తదితర అంశాలను పరిశీలించారు. వీటన్నిటికీ సంబంధించి మ్యాప్ ను తయారు చేయాలని ఆయన సర్వేయర్లను ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు ముందుగా ఎన్నికల కమీషన్ కు సంబంధించిన ఆదేశాలు, రూల్సు తెలుసుకోవాలని, అలాగే ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలను పరిశీలించి అనంతరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో విధులను సక్రమంగా నిర్వహించాలని, ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ ప్రతీసారి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, అంతా ఆన్‌లైన్‌లో చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఎంఎల్‌సీ ఎన్నికలను కూడా తేలికగా తీసుకోకూడదని, అభ్యర్థి ఇక్కడ లేకపోయినా కోడ్‌ను విధిగా అమలు చేయాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి.ఏ. కృష్ణారావు, రెవిన్యూ ఇనస్పెక్టర్ తేజ, మహారాణీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వీరయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us