గంగవరం,1 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం లభిస్తుందని ఎంపీడీవో జాన్ మిల్టన్ అన్నారు. గంగవరంలో మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని సచివాలయం ఆవరణలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఇంటిని, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పారిశుధ్య లోపం కారణంగా అనేక అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన కోరారు. మండలంలో గంగవరం, నెల్లిపూడి రెండు గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తొలిసారిగా ఈ రెండు పంచాయతీల్లో మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. పరిశుభ్రత కోసం ప్రతి ఇంటి యజమాని రోజుకు రూ.రెండు వంతున పంచాయితీకి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మనం - మన పరిశుభ్రత కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే వై.జంక్షన్ లో ర్యాలీ నిర్వహించి ఇంటింటా పర్యటించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఉపాధి ఏపీవో సురేష్ కుమార్, వెలుగు ఏపీఎం సత్య ప్రసాద్, మాజీ సర్పంచ్ అక్కమ్మ, పంచాయతీ కార్యదర్శి శాంతి, గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ వలంటీర్లు, ఉపాధిహామీ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







