* పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
* ఘనంగా అఖిల గాండ్ల తెలికుల వన సమారాధన
UPDATED 10th NOVEMBER 2019 SUNDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : కార్తీక మాసంలో నిర్వహించుకునే వనసమారాధనలు ఐక్యత, స్నేహభావానికి నిదర్శనంగా నిలుస్తాయని పెద్దాపురం నియోజవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. అఖిల గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పొలిపల్లి శ్రీనివాస్, అలమండ ప్రసాద్ అధ్యక్షతన స్థానిక విటికర్ బాలికల ఉన్నత పాఠశాలలో అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్తీక వన సమారాధనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, సంఘం రాష్ట్ర శాఖ గౌరవాధ్యక్షుడు సింగవరపు సాయిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ఎవరికి వారు సంబంధం లేకుండా జీవనం సాగిస్తున్నారని, అందరూ కలిసి ఒకచోట చేరి ఐక్యతతో సంతోషంగా నిర్వహించుకునే ఇలాంటి కార్యక్రమాల వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం అన్ని సామాజిక వర్గాల వారు ఆయా సామాజిక వర్గాల వారీగా వన సమారాధనలు నిర్వహించడం సామాజిక మార్పుకు నాంది అని పేర్కొన్నారు. తెలికుల సంఘం సమస్యల పరిష్కారినికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలకు రెండు ఫ్యాన్లు చినరాజప్ప చేతుల మీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైస్సార్సీపీ నాయకులు గోలి వెంకట అప్పారావు చౌదరి (దొరబాబు), పట్టణ టీడీపీ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, సంఘం జిల్లా కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నరవ అనంతం, అంబటి సుబ్రమణ్యం, చిప్పాడ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు సింగవరపు నాగేశ్వరరావు, విశాఖపట్నం అధ్యక్షుడు గొట్టిపల్లి వెంకట్రావు, అనపర్తి సంఘం అధ్యక్షుడు పొలిపల్లి శ్రీనివాసరావు, అన్నవరం అధ్యక్షుడు నేమాపు రమణ, రాజమండ్రి అధ్యక్షుడు వసాధి జగ్గారావు, తాళ్లరేవు అధ్యక్షుడు కె. రాంబాబు, పిఠాపురం అధ్యక్షుడు కె. శ్రీనివాస్, కోశాధికారి సింగవరపు రఘు, సంఘ సభ్యులు మురపాక వీరభద్రరావు, వి. త్రిమూర్తులు, ఎన్. కృష్ణ ఆదినారాయణ, జామి ప్రసాద్, నేరెళ్ల వెంకటరమణ, వీరస్వామి, వసాది ధనరాజు, సీతారామ సూర్యప్రకాష్, హరిబాబు, దేవరపల్లి శ్రీను, ధర్మవరపు సత్యనారాయణ, నేరెళ్ల సత్యనారాయణ, శివ, వెంకటరమణ, శ్రీను, లోకనాథం, అలమండ రంగనాథ స్వామి,అధిక సంఖ్యలో తెలికుల కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.







