UPDATED 18th MARCH 2018 SUNDAY 10:00 PM
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం చాళుక్య శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి వారి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఈ నెల 27 వ తేదీ వరకు స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బిక్కిన సాయి దంపతులచే స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. విళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్ రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మహంకాళి వెంకట గణేష్, పడాల వీరబాబు, దూది రాజు, గొల్లపల్లి కామరాజు, భక్త సంఘం నాయకులు చుండ్రు గోపాలకృష్ణ, పసల పద్మరాఘవరావు, ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, ఆలయ పండితులు వేమూరి సోమేశ్వర శర్మ, తదితరులు పాల్గొన్నారు.







