ప్రగతిలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

UPDATED 20th JULY 2018 FRIDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో 2018-19 సంవత్సరం బిటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను ఆహ్వానిస్తూ బిటెక్ రెండవ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులకు అవసరమైన సలహాలు అందిస్తూ, వారు తమ లక్ష్యసాధనకు కృషి చేసే విధంగా దిశా నిర్దేశం చేయడంలో సీనియర్ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థుల మధ్య సహృద్భావ వాతావరణం పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులు తమలోని సాంస్కృతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ వేదిక చక్కని అవకాశాలను కలుగచేస్తుందని అన్నారు. కళాశాలకు చెందిన సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలకు చెందిన జూనియర్ విద్యార్థుల నాట్య ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు, క్విజ్ వంటి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. భవిష్యత్తులో కళాశాల వివిధ విభాగాల వారీగా నిర్వహించే వివిధ కార్యక్రమాల పట్ల జూనియర్ విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సీనియర్ విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ కె. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, అధిక సంఖ్యలో  విద్యార్థులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us