మార్షల్ ఆర్ట్స్ లో విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

UPDATED 28th JULY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: మార్షల్ ఆర్ట్స్ లో విద్యార్డులు చూపిస్తున్న ప్రతిభ అభినందనీయమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు చిత్తులూరి వీర్రాజు (రాజా), ఈదల ఈశ్వరకుమార్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరాటే, తైక్వండో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెల్టులు, సర్టిఫికెట్లను ఆదివారం వారు పంపిణీ చేశారు. కోచ్ డి. శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు వీర్రాజు, ఈశ్వరకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా కాకినాడ నుంచి వస్తూ విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో ఉచితంగా శిక్షణ ఇస్తున్న కోచ్ శంకరరావును ఈ సందర్భంగా వారు అభినందించారు. కోచ్ శంకరరావు మాట్లాడుతూ వచ్చే నెలలో హైదరాబాదులో జాతీయస్థాయి పోటీలు జరగనున్నాయని, వాటికి తమ విద్యార్థులు 15 మంది వెళుతున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా 25 మంది విద్యార్థులకు ప్రమోషన్ బెల్టులు, సర్టిఫికెట్లు, ముగ్గురు విద్యార్థులకు ఇండియన్ కరాటే అసోసియేషన్ బ్లాక్ బెల్టులు, సర్టిఫికెట్లను ముఖ్య అతిధుల చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేకా శ్రీనివాసు, కార్యదర్శి ప్రత్తి రామలక్ష్మణముర్తి, జోన్ మాజీ చైర్మన్ గుండు శంకరరావు, నాయకులు గిడుతూరి శ్రీనివాస్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us