UPDATED 23rd DECEMBER 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతీ అర్జీ, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఐదు అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. వీటిలో ఆక్రమించుకున్న స్థలం తిరిగి ఇప్పించాలని ఒకటి, పట్టాదారు పాస్ పుస్తకం గురించి ఒకటి, పట్టాదారు పాస్ పుస్తకాలను ఆన్ లైన్ లో నమోదు చేయవలసిందిగా ఒకటి, గ్రామ పంచాయతీ కార్యాలయం భవన సమస్యను పరిష్కరించమని ఒకటి, ఒంటరి మహిళ పింఛన్ కోసం ఒకటి చొప్పున అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







