UPDATED 18th SEPTEMBER 2019 WEDNESDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు చేసిన సమ్మె కాలపు ఒప్పందం ప్రకారం సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పలపాటి చంద్రదాస్ అన్నారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పలపాటి చంద్రదాస్ మాట్లాడుతూ 2018 సంవత్సరం నాటి సమ్మె కాలపు ఒప్పందం ప్రకారం సమ్మె కాలపు 13 రోజుల వేతనం ఇవ్వాలని, పెరిగిన రూ.12వేలు వేతనానికి రావలసిన వెయ్యి రూపాయలు ఇన్సెంటివ్ గా ఇవ్వాలని అన్నారు. ప్రతీ నెలా కార్మికునికి క్యాజువల్ సెలవు మంజూరు చేయాలని, రోజురోజుకు పట్టణంలో పారిశుధ్యం పెరుగుతున్న రీత్యా 99 మంది పారిశుధ్య కార్మికులను పారిశుధ్య పనులు చేసేలా చూడాలని అన్నారు. ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను నిలుపుదల చేసి పారిశుధ్య పనులకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణ అధ్యక్షుడు చెన్నా శ్రీను, ఉపాధ్యక్షుడు శీరంశెట్టి వెంకటేష్, కార్యదర్శి మిర్యాల రాజు, కోశాధికారి సింగంపల్లి శ్రీను, పెనుమాకుల సారమ్మ, సింగంపల్లి పద్మ, అల్లం రత్నం, చెన్నాలక్ష్మి, పైడి రాజు, బంగారు అప్పారావు, బంగారు వెంకటగిరి, చెన్నా లోవలక్ష్మి, చింతల బాలయ్య, కసింకోట మంగ, తదితరులు పాల్గొన్నారు.







