UPDATED 27th JULY 2018 FRIDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం ఆదిత్య విద్యాప్రాంగణంలో ప్రముఖ గణితావధాని, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ శ్రేయోభిలాషి, మిత్రుడు సాయి రామకృష్ణ విద్యారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డుతో సత్కరించిన సందర్భంగా తన అభినందనలు తెలియచేస్తున్నానని, ఇది ఆయన కృషికి, అంకితభావానికి, క్రమశిక్షణకు గుర్తింపుగా ఇచ్చిన అవార్డు అని అన్నారు. ఈ సందర్బంగా సాయి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, అలాగే జాతీయస్థాయి అవార్డు పొందిన అనంతరం తన ఆనందాన్ని గురుతుల్యులు శేషారెడ్డి గారితో పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, తదితరులు సాయి రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియచేశారు.







