ఆదిత్యలో కాట్ పై అవగాహనా తరగతులు

UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో కాట్-2018 పరీక్షపై విద్యార్థులకు ఐఐఎం, రాయపూర్ కి చెందిన ప్రొఫెసర్ రామకృష్ణచే అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఐఐఎంలలో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష కామన్ అడ్మిషన్ టెస్ట్( కాట్) లో అర్హత పొందడం తప్పనిసరని అన్నారు. కాట్-2013 లో అఖిలభారత స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించిన తోటకూర శివ సూర్య తేజ తమ సంస్థ విద్యార్థి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పరీక్షపై సరైన దృక్పథం, సంపూర్ణ అవగాహన కోసం ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు తమ విద్యార్థులకు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us