ముగిసిన యువజన సమాఖ్య శిబిరం

UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: సెప్టెంబర్ నెల 25 నుచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యువజన సమీక్ష శిబిరం విజయవంతంగా జరిగినట్లు సెట్రాజ్ సిఇవో ఎస్. మల్లిబాబు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక టిటిడిసిలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ పదమూడు జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి సుమారు 280 మంది యువత హాజరయ్యారని, యువతకు అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి నైపుణ్యతను పెంపొందించే విధంగా శిక్షణ ఇవ్వడం జరిగినదని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాఅజరైన ఎన్.సి.సి గ్రూప్ కమాండర్ నాయుడు మాట్లాడుతూ  సైనిక దళాల్లో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు ఏర్పర్చుకోవాలని అన్నారు. విస్తరణ శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ రామ్ గోపాల్ మాట్లాడుతూ యువత మంచి ఆదర్శమార్గంలో నడవాలని, వారు చదువుకున్న చదువులకు మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా తగిన శిక్షణ తీసుకోవాలని అన్నారు. అనంతరం క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.  శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు సర్టిఫికెట్లు అందజేశారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us