సాయి మందిరంపై ఆధిపత్య పోరు

* ముదురుతున్న సాయి మందిరం ట్రస్ట్ వ్యవహారం
* బాబా ఆస్తుల వివరాలు వెల్లడించాలంటున్న భక్తులు
* ఆర్డీవో ఎదుట విచారణకు హాజరుకానున్న ట్రస్టీలు, అధికారులు

UPDATED 1st NOVEMBER 2020 SUNDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం-సామర్లకోట రోడ్డులో స్థానిక కోర్టుల వద్ద ఉన్న షిరిడీ సాయి మందిరంపై ఆధిపత్యం కోసం ఓవైపు ట్రస్టీలు, మరో వైపు సాయిసేవా భక్తులు ఒకరిపై ఒకరు పరస్పరం అధికారులకు, పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో సాయి మందిరం ట్రస్ట్ వ్యవహారం కాస్తా ముదిరిపాకాన పడడంతో ఈనెల రెండవ తేదీన ట్రస్ట్ చైర్మన్ తాటికొండ వెంకటేశ్వరరావుతో పాటు దేవాదాయ, రెవిన్యూ అధికారులను విచారణకు హాజరుకావాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు ఆదేశించారు. దీంతో పట్టణంలో సాయి మందిరం వ్యవహారం కాస్తా చర్చనీయాంశంగా మారింది. సుమారు 20 సంవత్సరాలు క్రిందట నిర్మించిన ఈ మందిరానికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తుండడంతో దినదినాభివృద్ధి చెందుతోంది. అయితే ట్రస్ట్ సొమ్ములు దుర్వినియోగం అవుతున్నట్లు ఇటీవల పలు విమర్శలు వెల్లువెత్తడంతో కానుకలు సమర్పించిన దాతలతో పాటు సాయి భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాబా మందిరానికి బంగారు, వెండి వస్తువులతో పాటు భూములు, బ్యాంకు నిల్వలు భారీగా ఉండడంతో ట్రస్ట్ పై పట్టు సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. బాబా ట్రస్ట్ వ్యవహారం కాస్తా రాజకీయంగా మారే అవకాశం ఏర్పడిందని పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో బాబా మందిరాన్ని, ఆస్తులను పరిరక్షించాలని భక్తులు కోరుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us