UPDATED 24th SEPTEMBER 2019 TUESDAY 6:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్) : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ 1&2 యూనిట్ల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సేవా కార్యక్రమాలలో పాల్గోవడం అభినందనీయమని, విద్యార్థులలో సేవాభావం, క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం 1969 సెప్టెంబర్ 24న ఏర్పాటు చేసిందని అన్నారు. నాటి నుంచి పలు సేవా కార్యక్రమాల ద్వారా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భాగస్వాములు అవుతున్నారని అన్నారు. ఎన్ఎస్ఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాలలో ఉత్తమ వాలంటీర్లను గుర్తించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందచేశారు. ఆంధ్రపదేశ్ రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డుచే పర్యావరణ మిత్ర -2019 అవార్డు గ్రహీత, ఆదిత్య మీడియా మేనేజర్ తోటకూర గంగాధర్, అలాగే ఇటీవల క్యాంపస్ లో ఒక మహిళ ప్రాణాలు సాహసోపేతంగా కాపాడిన క్యాంపస్ సెక్యూరిటీ ఇంఛార్జ్ డి. శివప్రసాద్ లను దుశ్శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, హెడ్ ఆర్&డి డాక్టర్ కె.వి.ఎస్.ఆర్. మూర్తి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె. పవన్, పి. శివకుమార్, ఆర్. జ్ఞానవర్జిన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శర్మ, సిబ్బంది కూనిరెడ్డి శ్రీనివాస్, మణికంఠ, దయామనోజ్, రవి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.







