క్రియ పిల్లల పండుగ పోటీల్లో దుర్గాప్రసాద్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

UPDATED 18th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: ఇటీవల జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ) వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రియ పిల్లల పండుగ పోటీల్లో స్థానిక శ్రీ దుర్గాప్రసాద్ పాఠశాలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో సోమవారం ఆయన మాట్లాడుతూ చిత్రలేఖనం, మట్టితో బొమ్మలు  తయారీ, గేయాలు, విచిత్ర వేషాధారణలు, జానపద నృత్యాలు, కథలు చెప్పడం వంటి పలు అంశాల్లో తమ పాఠశాల విద్యార్థులకు బహుమతులు సాధించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఒకటవ తరగతికి చెందిన సహస్ర, ఐదవ తరగతికి చెందిన ఫణిహారికలు విశేష ప్రతిభ కనబరిచి ప్రత్యేక బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ సంతోష్, ప్రిన్సిపాల్ మోహన్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us