Covid Fourth Wave : మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ?

UPDATED 20th MARCH 2022 SUNDAY 09:52 AM

Covid Fourth Wave : ఇంకెక్కడిది.. అంతా అయిపోయింది.. ఇప్పుడు లేదు.. ఇక రాదనుకుంటున్న వైరస్.. మళ్లీ రాబోతోందా? ఇండియాలో.. కరోనా ఫోర్త్‌వేవ్‌ ముంచుకొస్తోందా.? ఇప్పటికే శాంతించిన మహమ్మారి.. మళ్లీ కోరలు చాచేందుకు సిద్ధమైందా.? తూర్పు ఆసియా దేశాల్లో పెరుగుతున్న కేసులు.. దేనికి సంకేతం? కచ్చితంగా చెప్పలేం గానీ.. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం.. పెను ముప్పు తప్పకపోవచ్చంటున్నారు. కరోనా ముసురు మళ్లీ కమ్ముకోవచ్చన్న అంచనాలు.. ఆందోళన కలిగిస్తున్నాయి.

 

 

ఇందుకు.. సౌత్ కొరియా, చైనాలో పెరుగుతున్న కేసులే బిగ్ ఎగ్జాంపుల్. అందుకే.. జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కరోనా థర్డ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. ఫోర్త్‌వేవ్‌ను కూడా ముందు నుంచే కంట్రోల్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆసియా దేశాల్లో కేసులు పెరుగుతుండడంతో.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చర్యలు తీసుకోవాలంటూ.. రాష్ట్రాలకు అలర్ట్ చేసింది కేంద్రం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us