UPDATED 14th MARCH 2020 SATURDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మండలం అనూరు గ్రామంలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా శిబిరం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటి విద్యార్థులకు వాటి సంరక్షణా భాద్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జె. శ్రీనివాస్, అఖిల్, వాలంటీర్లను అభినందించారు. ఈ సేవా కార్యక్రమాలలో సుమారు 60మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.







