* రైల్వే స్టేషన్ మేనేజర్ వి.ఎస్.ఎన్. శాస్త్రి
UPDATED 20th OCTOBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: అంతర్గత భద్రతలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని రైల్వే స్టేషన్ మేనేజర్ వి.ఎస్.ఎన్. శాస్త్రి అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే రక్షక దళం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినవారు అవుతారని, అలాగే ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ సురేష్ గౌడ్ మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకోవడం పౌరులుగా మన కర్తవ్యమని, వారి త్యాగం కలకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అయన పేర్కొన్నారు. ఈశిబిరంలో 45 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







