Z Category Security To MP Owaisi: ఎంపీ ఒవైసీకి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

UPDATED 4 FEBRUARY 2022  FRIDAY 01:10 PM

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్): ఉత్తరప్రదేశ్ లో ఎన్నిక ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా..ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై అంగంతకులు తుపాకులతో కాల్పుల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఒవైసీకి జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది. గురువారం (ఫిబ్రవరి 3,2022) కాల్పుల ఘటన తర్వాత ఎంపీ ఒవైసీ భద్రతపై కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది.

సమీక్ష అనంతరం.. సీఆర్ఫీఎఫ్‌తో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జెడ్‌ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించింది. ఈక్రమంలో తక్షణమే ఒవైసీకి సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోం శాఖ.కాగా..ఒవైసీపై కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేసి.. ప్రశ్నిస్తు‍న్నారు. మరోవైపు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఈసీని డిమాండ్ చేసిన ఒవైసీ.. ఈ దాడి వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని దీనిపై దర్యాప్తు జరిపించాలని ఒవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తనపై జరిగిన దాడి వెనుక మాస్టర్‌ మైండ్‌ ఉందని..అనుమానం వ్యక్తం చేస్తు‍న్నారు.

కాగా ఒవైసికి జెడ్‌ ప్లస్ కేటగిరీలో.. నలుగురు నుంచి ఆరుగురు NSG కమాండోలు, పోలీసు సిబ్బందితో సహా 22 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో.. ఒక ఎస్కార్ట్ కారుతో పాటు ఢిల్లీ పోలీసులు లేదంటే ITBP లేదంటే CRPF సిబ్బంది ఉంటారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us