మార్చి ఒకటి నుంచి గైట్ లో మైత్రి ఉత్సవాలు

UPDATED 28th FEBRUARY 2019 THURSDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా సంస్థల ప్రాంగణంలో మైత్రి-2019 పేరిట క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ తెలిపారు. గురువారం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రెండురోజులపాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మహిళలు,పురుషులకు 100,200,400,800 మీటర్లు పరుగుపందెం, లాంగ్ జంప్, హై జంప్, సింగిల్స్,డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లో చదరంగం టెన్నిస్, షాట్ ఫుట్, డిస్కస్, జావలిన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, ఖోఖో, పురుషులకు ప్రత్యేకంగా వాలీబాల్, బాస్కెట్ బాల్, మహిళలకు ప్రాథేయకంగా త్రోబాల్, నిర్వహిస్తామని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వోకల్, ఇనుస్ట్రుమెంటల్ మ్యూజిక్ క్లాసికల్, వెస్టర్న్ డాన్స్, స్కిట్, మిమిక్రీ, మైమ్, షార్ట్ ఫిలిం కాంటెస్ట్, మహిళలకు రంగోలి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిత్యం తరగతి గదులకు పరిమితమయ్యే విద్యార్థినీ, విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు మైత్రి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సవాల్లో పాల్గొనేందుకు తమ పేర్లు  ఇప్పటికే నమోదు చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ, చైతన్య సంస్థల సీఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్.రాజు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి.సుబ్బరాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివీప్రసాద్, డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డాక్టర్ ధనరాజు, డాక్టర్ రామానుజం, కె. వల్లీమాధవి, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us