చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ

UPDATED 13th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు చేపట్టిన మహాగర్జనను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు కరణం ప్రసాదరావు పిలుపునిచ్చారు. స్థానిక బళ్ళమార్కెట్ సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఈ నెల 15న జరిగే చలో విజయవాడ కార్యక్రమం పోస్టరును గురువారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం, అభివృద్ధిలో శ్రామికులకు న్యాయమైన భాగం కోసం జరిగే వామపక్షాల బహిరంగ సభను జయప్రదం చెయ్యాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు బాలం శ్రీనివాస్, తుంపాల శ్రీను,బి. సత్తిబాబు, నమ్మి భద్రరావు, కరణం గోవిందు రాజు, గోపాల్, మహేష్, సయ్యపురెడ్డి యువరాజు, సతీష్, నరవ సురేష్ కుమార్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us