రైలు ఢీకొని వ్యక్తి మృతి

UPDATED 10th MAY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గల పిఠాపురం లైనులో రైలు గేటు వద్ద సుమారు 40ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు గురువారం తెలిపారు. గూడ్స్ రైల్వే లోకో పైలెట్ వై.కె.ఆర్.ఆన్. మూర్తి రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్.సి గోవిందరావు తెలిపారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us